శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబమ్


హే స్వామినాథ కరుణాకర దీనబంధో – శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ – దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ – తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ ||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల – పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య – దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ ||
హారాదిరత్నమణియుక్తకిరీటహార – కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాఽమరబృందవంద్య – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ ||
పంచాక్షరాదిమనుమన్త్రిత గాఙ్గతోయైః – పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ ||
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా – కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాన్త్యా – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౮ ||
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || ౯ ||

శ్రీ హనుమాన్ చాలీసా తెలుగులో

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు......

తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు గానం: డా. పి. శ్రీనివాస్ ("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)
ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
★★★★★★★★★
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన


కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము
ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న
రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ
తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఆ
ఓం శాంతిః శాంతిః శాంతిః

శివ మానస స్తోత్రం


 శివ మానస స్తోత్రం


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్|1|

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు |2|

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో |3|

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ |4|

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో 
|5|

లింగాష్టకమ్

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

బిల్వాష్టకమ్



బిల్వాష్టకమ్


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

శివ పంచాక్షరి స్తోత్రమ్

 శివ పంచాక్షరి స్తోత్రమ్

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||

యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || 

శ్రీశివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్

శ్రీశివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్

శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ
ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ ।
నామశేషితానమద్భావాన్ధవే నమః శివాయ
పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ ౧॥

కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ ।
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ ౨॥

ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ
దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ ।
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ॥ ౩॥

ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ
పాపహారిదివ్యసిన్ధుమస్త తే నమః శివాయ ।
పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ ॥ ౪॥

వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ
హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ ।
నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ
కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ॥ ౫॥

బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ
జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ ।
బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ
జింహకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ॥ ౬॥

కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ
సామగానజాయమానశర్మణే నమః శివాయ ।
హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ
సామజాసురాఙ్గలబ్ధచర్మణే నమః శివాయ ॥ ౭॥

జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ ।
మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ ॥ ౮॥

యక్షరాజబన్ధవే దయాలవే నమః శివాయ
దక్షపాణిశోభికాఞ్చనాలవే నమః శివాయ ।
పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ
అక్షిఫాల వేదపూతతాలవే నమః శివాయ ॥ ౯॥

దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ ।
దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ
ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ ॥ ౧౦॥

రాజతాచలేన్ద్రసానువాసినే నమః శివాయ
రాజమాననిత్యమన్దహాసినే నమః శివాయ ।
రాజకోరకావతంసభాసినే నమః శివాయ
రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ ॥ ౧౧॥

దీనమానవాలికామధేనవే నమః శివాయ
సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ ।
స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ
దానవాన్ధకారచణ్డభానవే నమః శివాయ ॥ ౧౨॥

సర్వమఙ్గలాకుచాగ్రశాయినే నమః శివాయ
సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ ।
పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ
సర్వమన్మనోజభఙ్గదాయినే నమః శివాయ ॥ ౧౩॥

స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ
మాకరన్దసారవర్షిభాషిణే నమః శివాయ ।
ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ
నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ ॥ ౧౪॥

సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ
పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ ।
దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ
శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ ॥ ౧౫॥

పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ
దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ ।
మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ
స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ ॥ ౧౬॥

మఙ్గలప్రదాయ గోతురఙ్గ తే నమః శివాయ
గఙ్గయా తరఙ్గితోత్తమాఙ్గ తే నమః శివాయ ।
సఙ్గరప్రవృత్తవైరిభఙ్గ తే నమః శివాయ
అఙ్గజారయే కరేకురఙ్గ తే నమః శివాయ ॥ ౧౭॥

ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ
ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ ।
దేహకాన్తిధూతరౌప్యధాతవే నమః శివాయ
గేహదుఃఖపుఞ్జధూమకేతవే నమః శివాయ ॥ ౧౮॥

త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ
దక్షసప్తతన్తునాశదక్ష తే నమః శివాయ ।
ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ
రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ ॥ ౧౯॥

న్యఙ్కుపాణయే శివఙ్కరాయ తే నమః శివాయ
సఙ్కటాబ్ధితీర్ణకిఙ్కరాయ తే నమః శివాయ ।
కఙ్కభీషితాభయఙ్కరాయ తే నమః శివాయ
పఙ్కజాననాయ శఙ్కరాయ తే నమః శివాయ ॥ ౨౦॥

కర్మపాశనాశ నీలకణ్ఠ తే నమః శివాయ
శర్మదాయ నర్యభస్మకణ్ఠ తే నమః శివాయ ।
నిర్మమర్షిసేవితోపకణ్ఠ తే నమః శివాయ
కుర్మహే నతీర్నమద్వికుణ్ఠ తే నమః శివాయ ॥ ౨౧॥

విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ
శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ ।
ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ
కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ ॥ ౨౨॥

అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ
సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ ।
స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ
విప్రడిమ్భదర్శితార్ద్రభావ తే నమః శివాయ ॥ ౨౩॥

సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ
భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ ।
పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ
తవకాఙ్ఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ ॥ ౨౪॥

భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ
శక్తికల్పితప్రపఞ్చభాగినే నమః శివాయ ।
భక్తసఙ్కటాపహారయోగినే నమః శివాయ
యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ ॥ ౨౫॥

అన్తకాన్తకాయ పాపహారిణే నమః శివాయ
శాన్తమాయదన్తిచర్మధారిణే నమః శివాయ ।
సన్తతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ
జన్తుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ ॥ ౨౬॥

శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరిఞ్చితుణ్డమాలినే నమః శివాయ ।
లీలినే విశేషరుణ్డమాలినే నమః శివాయ
శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ ॥ ౨౭॥

శివపఞ్చాక్షరముద్రాం
చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ ।
నక్షత్రమాలికామిహ
దధదుపకణ్ఠం నరో భవేత్సోమః ॥ ౨౮॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ
శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

శివపంచాక్షరి స్త్రోత్రం అంటే!

          శివపంచాక్షరి స్త్రోత్రం అంటే!

కార్తీక మాసంలో భక్తులు నిత్యమూ శివభక్తిలో లీనమయ్యేందుకు, అనేక నియమాలను ఏర్పరిచారు పెద్దలు. `శివపంచాక్షరి స్తోత్రాన్ని`ని జపించాలనడం వాటిలో ఒకటి! శివపంచాక్షరి అంటే శివుని తల్చుకునేందుకు జపించే అయిదు అక్షరాల మంత్రం. అదే `నమః శివాయ`. ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆదిశంకరులవారు. అదే శివపంచాక్షరి స్తోత్రం! స్తుతించేందుకు రాసేది `స్తోత్రం`. కానీ ఆదిశంకరుల వారి రచనలు కేవలం స్తుతించవు… దర్శిస్తాయి! భగవంతుని రూపాన్నీ, ఆయన చుట్టూ ఉన్న ప్రదేశాన్నీ, అక్కడ ఉన్న వాతావరణాన్నీ…. అన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. స్తోత్రాన్ని సైతం గొప్ప కవిత్వంలా రాసినవారు శంకరులు. అందుకు మచ్చుతునక అయిన శివపంచాక్షరి స్తోత్రాన్ని మనఃస్ఫూర్తిగా స్మరించుకుందాం! దాని అర్థాన్ని ఒకసారి తరచిచూసుకుని శంకరులవారి భావ పారవశ్యానికి ముగ్ధులవుదాం!

ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||
- సాక్షాత్తూ ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు; భస్మమే ఆచ్ఛాదనగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు;
ఏ రకమైన మలినమూ సోకని శుద్ధుడు; అలాంటి శివునికి వందనం.

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||
- ఉత్తారదిన మొదలయ్యే నదులలో ప్రముఖమైనది మందాకినీ నది. ఇది ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్‌ వద్ద ప్రారంభమవుతుంది. మందగమనంతో హుందాగా, గంభీరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి మందాకిని అన్న పేరు వచ్చింది. కానీ మందాకినికి వరద కనుక వస్తే, ఉత్తరాది అంతా అతలాకుతలం అయిపోతుంది. 2013లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన వరదలను ఎవరు మాత్రం మర్చిపోగలరు. నిరంతరం ధ్యానంలో ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు లయకారునిగా మారిపోతాడు శివుడు. అలాంటి శివుని మందాకినీ నదితో పోల్చడం గొప్పగా తోస్తుంది. శంకరాచార్యుల వారికి కూడా మందాకిని నదితో గొప్ప అనుబంధం ఉంది. ఆయన కేదార్‌నాథ్‌ క్షేత్రంలో కొన్నాళ్లు నివసించడమే కాకుండా, ఇక్కడే శివైక్యం అయ్యారని కొందరి నమ్మకం.  అలాంటి మందాకిని జలాలతోనూ, చందన లేపనంతో పూజింపబడేవాడు అంటారు ఆదిశంకరులు. నందీశ్వరాది ప్రమథగణాలకు నాయకుడు; అతి సాధారణమైన మందారపుష్పం మొదలుకొని అనేకానేక పుష్పాలతో పూజింపబడేవాడు అయిన శివునికి వందనం అంటున్నారు ఆదిశంకరులు.

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||
- సూర్యుడు ఎలాగైతే కమలాన్ని వికశింపచేస్తాడో… శివుడు తన పట్ల చూపే అనురాగానికీ, భక్తుల పట్ల చూపే మహిమకూ పొంగిపోయే గౌరీదేవి ముఖం ఆయనవల్ల వికసిస్తుందట. (చాలామంది కమలం రాత్రిపూట వికసిస్తుందనుకుంటారు. నిజానికి రాత్రిపూట వికసించే కమలం మనం రోజూ చూసేది కాదు. హిమాలయాల వంటి ప్రాంతాలలో అరుదుగా కనిపించే `బ్రహ్మకమలం` అనే పుష్పం. మామూలు కమలం సూర్యునితోనే వికసిస్తుంది).

- ఇక దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినవాడు శివుడు. సాక్షాత్తూ శివునికి మామగారు అయినప్పటికీ… దక్షుడు అహంకారంతో ఆ పరమశివుని అవమానిస్తూ యజ్ఞాన్ని నిర్వహించాడు. అలాంటి దక్షయజ్ఞాన్ని నేలమట్టం చేసి అతని అహంకారాన్ని నిర్మూలించాడు శివుడు. దక్షుడంతటివాడి అహంకారాన్నే త్రుంచగలిగిన ఆ పరమశివుని పూజిస్తే, మనలోని అహంకారం సైతం భస్మీపటలం అయిపోతుంది కదా! అలాంటి గరళకంఠుడు, తన జెండా మీద వృషభాన్ని  గుర్తుగా కలిగిన వాడు అయిన శివునికి వందనం.

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||
- వశిష్ఠుడు, అగస్త్యుడు (కుండలో పుట్టినవాడు కాబట్టి ఈయనను కుంభోధ్భవుడు అని కూడా అంటారు), గౌతముడు వంటి గొప్ప మునీంద్రులతోనూ, దేవతలతోనూ పూజింపబడేవాడు; చంద్రుడు, సూర్యడు, అగ్నిని మూడు నేత్రాలుగా కలిగినవాడు అయిన ఆ పరమశివునికి వందనం.

యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||
- కోరికలను తీర్చే యక్షునిలా కనిపించినా, దుష్టులను దండించే శూలాన్ని ధరించినా… ఆ జటాధరునికి, దివ్యపురుషునికి, దిగంబరునికీ వందనం!

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
ఇది ఫలశ్రుతి! శివసన్నిధిలో ఈ పంచాక్షరాలని ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తితో పాటు, అక్కడి పారవశ్యం కూడా దక్కుతుంది. అలాగని ఈ స్తోత్రాన్ని గుడిలోనే పఠించాలని ఏమీ లేదు. మనసులో శివుని నింపుకున్నా, అది `శివసన్నిధే` అవుతుంది కదా! ఇక శివుని అణువణువునా నింపుకున్నవారికి, ఈ ప్రపంచమే శివలోకమవుతుంది!

విశ్వనాథాష్టకము



నిర్వాణ షట్కం స్తోత్రం

 నిర్వాణ షట్కం స్తోత్రం


మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం – న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః – న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2 ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ – మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3 ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం – న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4 ||
న మృత్యుర్న శంకా న మే జాతిభేదః – పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5 ||
అహం నిర్వికల్పో నిరాకారరూపో – విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
సదా మే సమత్వం న ముక్తిర్న బంధః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౬ ||