Showing posts with label రామ. Show all posts
Showing posts with label రామ. Show all posts

శ్రీ హనుమాన్ చాలీసా తెలుగులో

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు......

తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు గానం: డా. పి. శ్రీనివాస్ ("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)
ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
★★★★★★★★★
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన


కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము
ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న
రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ
తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఆ
ఓం శాంతిః శాంతిః శాంతిః

వెంకటేశ్వర వజ్రకవచం

          వెంకటేశ్వర వజ్రకవచం

మార్కండేయ ఉవాచ :

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం 
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు 
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం

శ్రీ రామ రక్షాస్తోత్రం ....

రచన: బుధ కౌశిక ఋషి
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః
ధ్యానమ్ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్
స్తోత్రమ్చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం
శ్రీరామ జయరామ జయజయరామ

నిత్య పారాయణ శ్లోకాలు ...

ప్రభాత శ్లోకంకరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||
ప్రభాత భూమి శ్లోకంసముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
సూర్యోదయ శ్లోకంబ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||
స్నాన శ్లోకంగంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
భస్మ ధారణ శ్లోకంశ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ |
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||
భోజన పూర్వ శ్లోకంబ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
భోజనానంతర శ్లోకంఅగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||
సంధ్యా దీప దర్శన శ్లోకందీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||
నిద్రా శ్లోకంరామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||
కార్య ప్రారంభ శ్లోకంవక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
గాయత్రి మంత్రంఓం భూర్భువస్సువః | తథ్స’వితుర్వరే”ణ్యం |
భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
హనుమ స్తోత్రంమనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||
శ్రీరామ స్తోత్రంశ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
గణేశ స్తోత్రంశుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||
శివ స్తోత్రంత్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధ’నమ్ |
ఉర్వారుకమి’వ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ ||
గురు శ్లోకంగురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
సరస్వతీ శ్లోకంసరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
లక్ష్మీ శ్లోకంలక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
వేంకటేశ్వర శ్లోకంశ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
దేవీ శ్లోకంసర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||
దక్షిణామూర్తి శ్లోకంగురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
అపరాధ క్షమాపణ స్తోత్రంఅపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా |
దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
బౌద్ధ ప్రార్థనబుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
శాంతి మంత్రంఅసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||
ఓం సహ నా’వవతు | స నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై |
తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
విశేష మంత్రాఃపంచాక్షరి – ఓం నమశ్శివాయ
అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ